నిరుద్యోగులకు శుభవార్త.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే
ఏపీలో నిరుద్యోగలకు శుభవార్త వచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాక పలు అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Cabinet Meet 2024
AP DSC Notification 2024 : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం దాదాపు 2గంటల పాటు సాగింది. 40అంశాలతో కూడిన ఎజెండాను కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వాటికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్నమెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ-2024 నోటిషికేషన్ విడుదలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
Also Read : హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తం బదిలీ.. కారణమేమిటంటే?
సీఎం జగన్ అధ్యక్షతన విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోస్టులు ఖాళీలు, విధివిధానాలు, తేదీలు, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎప్పటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే విషయంపై సమావేశంలో చర్చిస్తారు. అయితే, రెండురోజుల్లో మెగా డీఎస్సీ- 2024కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గత ఐదు సంవత్సరాల నుంచికూడా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏపీలోని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా డీఎస్సీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6,100 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించడానికి ఏపీ కేబినెట్ లో నిర్ణయించారు. వీటితో పాటు యూనివర్శిటీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 62ఏళ్లకు పెంపు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read : ప్రకాశం జిల్లాలో వైసీపీకి మరోషాక్.. మాగుంట బాటలో మద్దిశెట్టి?
ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలు..
- నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6,100 పోస్టులతో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం.
- వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఆమోదం
- ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.
- ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్.
- ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
- ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం.
- అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.
- నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం.
- శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
- ఆర్జేయూకేటీకి రిజిస్టార్ పోస్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్.. ఆమేరకు చట్టంలో సవరణకు ఆమోదం తెలిపింది.