మందుబాబులకు గుడ్‌న్యూస్..! ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు..
అటు వరదలు, అధిక వర్షాల వల్ల పంట నష్ట పరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించారు.

Ap Cabinet Key Decisions : ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేశారు.
Also Read : వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి?
వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించారు. అటు వరదలు, అధిక వర్షాల వల్ల పంట నష్ట పరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించారు. వరద ముంపు సాయం అద్దెకు ఉండే వారికే ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు.