నరసరావుపేట అభ్యర్థి అతడే.. మూడో జాబితాను ఫైనల్ చేసిన సీఎం జగన్?
ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఆశావహులు పెరగడం సహజం. కుటుంబంలో విభేదాలు వస్తుంటాయి. వాటిని సరి చేసుకుని ముందుకెళ్తాం.

Narasaraopeta MLA Candidate
CM Jagan : మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ ను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇక నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎంవో నుంచి పిలుపుతో నందికొట్కూరు ఇంఛార్జి బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. క్యాంప్ ఆఫీసులో జగన్ ను కలిసిను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ధర్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ చర్చిస్తున్నారు. రేపటిలోగా(జనవరి 9) మూడో జాబితాను ఫైనల్ చేయనుంది వైసీపీ అధిష్టానం.
నరసరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి.. మీటింగ్ తర్వాత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు చెప్పారు. దీనిపై గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో చాలావరకు పని చేశానని, రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. కొంతమందికి పనులు చేయలేకపోవడం నిజమేనన్న ఆయన.. సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామన్నారు. సరసరావుపేట నియోజకవర్గం నుంచి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు.
Also Read : పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?
”ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఆశావహులు పెరగడం సహజం. కుటుంబంలో విభేదాలు వస్తుంటాయి. వాటిని సరి చేసుకుని ముందుకెళ్తాం. ఎవరి మీద కేసులు పెట్టలేదు. నాది అలా వ్యక్తిత్వం, మనస్తత్వం కాదు. అలాంటిదేమీ జరగలేదు. పనులు జరగకపోవడం, పనులు ఆలస్యంగా జరగడం.. ఇలాంటి సమస్యలు తప్ప మరొకటి లేదు. నేను ఎవరిపైనా కేసులు పెట్టలేదు, వేధింపులకు పాల్పడలేదు. ఐదేళ్ల కాలంలో కొంతమందికి పనులు చేయకపోయి ఉండొచ్చు. వారందరికీ న్యాయం చేస్తాను. అసమ్మతిని పరిష్కరించుకుంటాను. నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నాకు టికెట్ ఇచ్చింది” అని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Also Read : గుంటూరులో ఎన్నికల వేడి.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?