మేనల్లుడి నిశ్చితార్ధానికి హాజరుకానున్న ఏపీ సీఎం జగన్

రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను కొడుకు నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు వైఎస్ షర్మిల.

మేనల్లుడి నిశ్చితార్ధానికి హాజరుకానున్న ఏపీ సీఎం జగన్

CM Jagan To Attend YS Sharmila Son Engagement

Updated On : January 17, 2024 / 10:28 PM IST

CM Jagan : మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ రేపు(జనవరి 18) హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు. ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు.

రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను కొడుకు నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు వైఎస్ షర్మిల. నిశ్చితార్థంతో పాటు వివాహానికి కూడా రావాలని అందరినీ ఆహ్వానించారు షర్మిల. ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఆహ్వానాలను కూడా ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు. ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.

Also Read : కొడుకు పెళ్లి పత్రికని పవన్‌కి అందించిన వైఎస్ షర్మిల..

రేపు(జనవరి 18) షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఎంగేజ్ మెంట్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తన కొడుకు నిశ్చితార్ధ వేడుకతో పాటు పెళ్లికి కూడా రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి – అట్లూరి ప్రియల పెళ్లి జరగనుంది. నిశ్చితార్ధం, వివాహం తర్వాత హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు సంబంధించి ఇన్విటేషన్ కార్డులను ఇప్పటికే పలువురు ప్రముఖులకు అందజేశారు షర్మిల.