YS Jagan Tour : నేడు విశాఖకు సీఎం జగన్.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..!
YS Jagan Vizag Tour : ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పట్టాల పంపిణీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి పక్కాగా పట్టాల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Ap Cm Jagan To Distribute House Pattas In Vizag Tour Today
YS Jagan Vizag Tour : ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పట్టాల పంపిణీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి పక్కాగా పట్టాల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది లబ్దిదారులకు లబ్ది చేకూరేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం వేదికానుంది. సీఎం జగన్ నేడు విశాఖలో నుంచే పేదలకు ఇల్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా జగన్ మోడల్ హౌజ్‌ను పరిశీలించనున్నారు. విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. షెడ్యూల్‌లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల 40 నిమిషాలకు సబ్బవరం మండలం పైడివాడ జగన్ చేరుకోనున్నారు. ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ పార్క్‌ను సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లేఅవుట్లను ఆయన పరిశీలించనున్నారు. మోడల్ హౌస్‌లను లబ్దిదారులకు జగన్ అందజేయనున్నారు.
ల్యాండ్ పూలింగ్ కోసం భూములను ఇచ్చిన రైతులతో జరిగే ఫొటో సెషన్ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు.. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, హౌసింగ్ స్కీం మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. విశాఖలో ఒక లక్షా ముప్పై వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద అందించనుంది ప్రభుత్వం. అర్హుల జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు.
జీవీఎంసీ పరిధిలోని పేదలకు 4వేల 661 ఎకరాల్లో 71 లేఅవుట్లలో లక్షా 23వేల మందికి ఇంటి పట్టాలను సీఎం అందించనున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 300 ఎకరాల్లో భారీ వెంచర్‌ను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి ఒక్కో సెంట్ స్థలం చొప్పున ప్రభుత్వం అందించనుంది.
Read Also : CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్.. క్లీన్‌స్వీప్ చేయాల్సిందే ..!