YS Jagan Mohan Reddy : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
YS Jagan Mohan Reddy : పని చేస్తున్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా చాన్స్ ఇచ్చారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయి, ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు.

YS Jagan Mohan Reddy
Village Ward Secretariat Employees : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయి, ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు.
జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 1.67 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆ శాఖలో మూడేళ్లుగా బదిలీలు లేవు. ఈ నేపథ్యంలో, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బదిలీలకు అవకాశం ఇచ్చింది.
పని చేస్తున్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా చాన్స్ ఇచ్చారు. అంతర్ జిల్లాల బదిలీల్లో స్పౌస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు. బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.