CM Jagan : రాష్ట్ర చరిత్రలో ఒక ఏడాదిలో ఇంత డబ్బు ఎప్పుడూ ఇవ్వలేదు, ఖర్చు చేయలేదు
ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు...

Cm Jagan Roads And Buildings
CM Jagan : రోడ్లు, భవనాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర‍్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు… రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలపగా, నెలఖరు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని సీఎం జగన్ అన్నారు. తర్వాత వర్షాలు బాగా పడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి, ఒక ముద్రవేసి విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.2205 కోట్లు కేటాయించామని సీఎం జగన్ తెలిపారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇంత మొత్తం ఇచ్చిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదు, ఖర్చు చేయలేదని చెప్పారు. మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్ తో చెప్పారు.
Drinking Water : పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు
33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పగా, ఈ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తి కాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారని జగన్ అన్నారు. వీటిని పూర్తి చేయడానికి సుమారు రూ.571 కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి- భోగాపురం తిరిగి ఎన్‌హెచ్-16కు అనుసంధానం అయ్యే బీచ్ కారిడార్ రోడ్డు నిర్మాణంపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. బీచ్ కారిడార్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు అధికారులు. విశాఖ-భోగాపురం మధ్య త్వరగా రాకపోకలు జరిగేలా రోడ్డు నిర్మించాలని అధికారులతో చెప్పారు సీఎం జగన్.
Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
అధికారులతో సీఎం జగన్
* రోడ్డు నిర్మాణరీతుల (డిజైన్) పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
* ఈ బీచ్ కారిడార్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలి.
* విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకోవాలి. అలాగే ఎయిర్ పోర్టు నుంచి కూడా నగరానికి వీలైనంత త్వరగా రావాలి.
* దీంతోపాటు ఈ రహదారిని అనుకుని టూరిజం ప్రాజెక్టులు వస్తాయి
* ఈ నేపథ్యంలో ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది
* ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌర విమానాలు రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయి
* రాత్రి పూట ల్యాండింగ్ కు కూడా నేవీ ఆంక్షల కారణంగా కష్టం అవుతోంది
* ఇలాంటి నేపథ్యంలో బీచ్ కారిడార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది