8లక్షల కోట్లు అప్పులు చేశారు, కనీసం రాజధాని అయినా నిర్మించారా? వైఎస్ షర్మిల ఫైర్

YCPలో వైఎస్ ను లేకుండా చేశారని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇలా రోజుకో రీతిన జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు షర్మిల.

8లక్షల కోట్లు అప్పులు చేశారు, కనీసం రాజధాని అయినా నిర్మించారా? వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila New Meaning For YSRCP

YS Sharmila : ఏపీ పీసీసీ చీఫ్ గా వరుస పర్యటనలు చేస్తున్న వైఎస్ షర్మిల.. అధికార వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఐదేళ్లలో 8లక్షల కోట్లు అప్పులు చేశారని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంత అప్పులు తెచ్చి కనీసం రాజధాని అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. ఇక, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి రోజూ మాట్లాడి.. అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఆ మాట ఎత్తలేదు అంటూ మండిపడ్డారు.

Also Read : వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది, ఇదే సాక్ష్యం- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఇక, BJP అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త అర్థం చెప్పిన షర్మిల.. ఈసారి YSRCP కి కొత్త అర్థం చెప్పారు. YSRCP అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని చెప్పారు. వైసీపీలో వైఎస్ ను లేకుండా చేశారని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇలా రోజుకో రీతిన జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు షర్మిల.

Also Read : B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్.. ఏపీలో బీజేపీకి కొత్త అర్థం చెప్పిన షర్మిల