వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది, ఇదే సాక్ష్యం- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..

YS Sharmila Slams CM Jagan
జగన్ ప్రభుత్వం టార్గెట్ గా చెలరేగిపోతున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఛాన్స్ చిక్కితే చాలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
”కృష్ణపట్నం పోర్టు అయినా, గంగవరం పోర్టు అయినా అదానీ లాంటి వారికి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇక ఏం మిగులుతుంది? మనకంటూ ఏం ఉంటుంది? ఇప్పటికైనా మనకంటూ ఏముంది? ఓ రాజధాని ఉందా? పోలవరం ఉందా? పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా? ఇప్పటికే ఏమీ లేదు. ఇక ఉన్నవి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు? మన బిడ్డలకు.
Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?
అందుకే చెబుతున్నా. ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు. ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇవాళ ఏపీ రాజకీయాల్లో ఉంది.
ఎవరు బెదిరించినా బెదిరేవాళ్లం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, మా బోర్డులను తీసేశారు. మా కార్యకర్తలను బెదిరించారు. వైసీపీ గూండాలే కాదు ఆఖరికి కలెక్టర్ తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే.. మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క. వైసీపీకి భయం పట్టుకుంది అనే కదా లెక్క.
నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే. ఇంతగా అడ్డుకుంటున్నారే. మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము, మేలు చేసే వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ.. మీరు రెడీయా? ” అని వైఎస్ షర్మిల అన్నారు.
Also Read : నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్..
* వైసీపీ ప్రభుత్వంలో అప్పులు పెరిగాయి తప్ప అభివృద్ధి లేదు.
* ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే ఉపయోగం లేదు.
* కాంగ్రెస్ మాత్రమే అందరికీ న్యాయం చేస్తుంది.
* నెల్లూరు లో మా ఫ్లెక్సీలను తొలగించారు.
* కలెక్టర్ తో సహా అధికారులు మమ్మల్ని అడ్డుకున్నారు.
* మమ్మల్ని చూసి వైసీపీ భయపడుతోంది.
* దేన్నయినా ఎదుర్కొనేందుకు సిద్ధం.
* వచ్చే ఎన్నికలకు అందరూ కష్టపడి పనిచేయాలి.
* ప్రత్యేక హోదా, పోలవరం రావాలన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండాలన్నా కాంగ్రెస్ రావాలి.
* టీడీపీ, జనసేన, వైసీపీలకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే.
* సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉంది.
* పోలవరం ప్రాజెక్టు కోసం కూడా పోరాడటం లేదు.
* ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని చంద్రబాబు అడిగి అధికారంలోకి వస్తేనే బీజేపీతో దోస్తీ కట్టి కేంద్రంలో పదవులు తీసుకున్నారు.
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై జగన్ రోజూ మాట్లాడారు
* ఎంపీలతో రాజీనామా చేయించారు. అధికారంలోకి వస్తేనే మరిచిపోయారు
* చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్ లో రాజధాని చూపించారు
* జగన్ మూడు రాజధానులు అన్నారు. ఒకటి కూడా రాలేదు
* బీజేపీ ఏమీ చేయకపోయినా బాబు, జగన్ దోస్తీ చేస్తున్నారు
* రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలుగా చేశారు.
* కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తీసేస్తున్నారు. దీనిని కూడా అదానీకి అప్పగించారు.