Covid 19 : ఏపీలో కరోనా..ఆ జిల్లాలో సున్నా కేసులు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 731 శాంపిల్స్ పరీక్షించగా...184 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.

Covid 19 : ఏపీలో కరోనా..ఆ జిల్లాలో సున్నా కేసులు

Ap Corona

Updated On : November 26, 2021 / 6:38 PM IST

AP Corona Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. అయితే..ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ వెలుగు చూడడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. జాగ్రత్తలు తీసుకోవాలంటూ..రాష్ట్రాలకు సూచించింది. అయితే..ఏపీలో గతంలో కన్నా..తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 184 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : MLC Madhav : మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే అభాసుపాలు కాక తప్పదు : ఎమ్మెల్సీ మాధవ్

2021, నవంబర్ 25వ తేదీ గురువారం 183 కేసులు, ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,69,303 పాజిటివ్ కేసులకు గాను… 20,52,708 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,432 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 వేల 163గా ఉందని తెలిపింది.

Read More : Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 731 శాంపిల్స్ పరీక్షించగా…184 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. కోవిడ్ వల్ల కృష్ణాలో ఒకరు మరణించారని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 214 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,03,16,261 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : AP Assembly : 26 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. నిరవధిక వాయిదా

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 04. చిత్తూరు 36. ఈస్ట్ గోదావరి 11. గుంటూరు 18. వైఎస్ఆర్ కడప 02. కృష్ణా 34. కర్నూలు 0. నెల్లూరు 13. ప్రకాశం 04. శ్రీకాకుళం 13. విశాఖపట్టణం 16. విజయనగరం 03. వెస్ట్ గోదావరి 30. మొత్తం : 184.