AP Covid-19 Updates : ఏపీలో 10,712 మంది డిశ్చార్జ్

  • Published By: sreehari ,Published On : September 17, 2020 / 07:18 PM IST
AP Covid-19 Updates : ఏపీలో 10,712 మంది డిశ్చార్జ్

Updated On : September 17, 2020 / 7:56 PM IST

AP Covid-19 Updates : కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా కోలుకుంటోంది.. రోజురోజుకీ కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకునే వారిసంఖ్యే అధికంగా కనిపిస్తోంది.



గత 24 గంటల్లో కరోనా నుంచి 10,712 మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 77,492 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 8,702 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీలో 6 లక్షల కరోనా పాజిటివ్ కేసులు దాటేశాయి.



ఏపీలో కొత్తగా 8,702 కరోనా కేసులు నమోదుకాగా, మరో 72 మంది మృతిచెందారు. ఏపీలో 6,01,462కి కరోనా కేసులు చేరాయి.. మరో 5,177 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో ఇప్పటివరకూ 48,84,371 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.