AP Covid : ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా ఎన్ని కేసులంటే..
ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది.

Ap Covid
AP Covid : ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. కేసుల సంఖ్య తగ్గడం.. రికవరీలు పెరుగుతుండటంతో ఊరటనిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97వేల 696 శాంపుల్స్ ని పరీక్షించగా 3వేల 797 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా ఆ జిల్లాలో 874 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో 493 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 105 కేసులు వెలుగుచూశాయి.
అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 5వేల 498 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 35మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 8 మంది కరోనాతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 12,706 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 18,89,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,38,469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 38,338కి తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18,89,513కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 18,38,469 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 12,706కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,19,93,618 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
#COVIDUpdates: 30/06/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,86,618 పాజిటివ్ కేసు లకు గాను
*18,35,574 మంది డిశ్చార్జ్ కాగా
*12,706 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 38,338#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/JiJm5R4JOt— ArogyaAndhra (@ArogyaAndhra) June 30, 2021