కరోనా నుంచి బయటపడుతున్న ఏపీ

Covid-19: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు గడిచిన 24గంటలు అంటే ఆదివారం జరిపిన టెస్టుల్లో కేవలం 305మందికే కరోనా వచ్చినట్లుగా నిర్థారించారు.
ర్యాపిడ్ యాంటిజెన్ 16వేల 842తో పాటు ఇతర టెస్టులు 28వేల 93మందికి జరిపిన టెస్టుల్లో మొత్తం 44వేల 935కి టెస్టులు జరిపారు. వీరిలో కేవలం 305మందికి కొవిడ్ పాజిటివ్ రాగా.. నెల్లూరులో ఇద్దరు కరోనా ప్రభావానికి ప్రాణాలు వదిలారు.
ఇదిలా ఉంటే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 541గా ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోటి 8లక్షల 75వేల 925మంది శాంపుల్స్ పరీక్షించారు.