ఇంటి వద్దకే పెన్షన్, ఒక్కరోజులోనే పూర్తి, ఈసారి వారితోనే పంపిణీ- సీఎస్ కీలక ప్రకటన

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. 29వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పెన్షన్ల పంపిణీకి సిద్ధం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

ఇంటి వద్దకే పెన్షన్, ఒక్కరోజులోనే పూర్తి, ఈసారి వారితోనే పంపిణీ- సీఎస్ కీలక ప్రకటన

Ap Pensions (Photo Credit : Google)

Pensions Distribution : ఏపీలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చి ఇస్తామని, ఒక్కరోజులోనే ఫించన్ల పంపిణీ పూర్తి చేస్తామని సీఎస్ నీరబ్ వెల్లడించారు. జూలై 1న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ చేస్తామన్నారు. పెంచిన ఫించన్ల మేరకు రూ.4,399.89 కోట్లను 65లక్షల 18వేల 496 మంది లబ్దిదారులకు ఒక్కరోజులోనే పంపిణీ చేస్తామని తెలిపారు. పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పెన్షన్ల పంపిణీ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు.

జూలై 1న ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. లబ్దిదారులు అందరికీ ఫించన్లు పూర్తయ్యే వరకూ పంపిణీ చేయాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయించినట్లు సీఎస్ వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు తోడు.. అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులను పెన్షన్ల పంపిణీకి పురమాయించామని సీఎస్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. 29వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పెన్షన్ల పంపిణీకి సిద్ధం కావాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేసేది. అయితే ప్రభుత్వం మారిపోవడంతో పెన్షన్లు ఎలా ఇస్తారు? ఎవరు ఇస్తారు? అనేది లబ్దిదారుల్లో ఉత్కంఠగా మారింది. పెన్షన్ దారుల్లో అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు నెలకొని ఉన్నాయి. గత ప్రభుత్వంలో మాదిరి కొత్త ప్రభుత్వంలోనూ వాలంటీర్లే ఇంటికి వచ్చి ఫించన్ ఇస్తారేమో అని భావించారు. అయితే, వాలంటీర్ల విషయంలో కూటమి సర్కార్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఎవరి ద్వారా ఫించన్లు పంపిణీ చేస్తారు అనేదానిపై స్పష్టత లేకపోయింది. పెన్షన్ల పంపణీకి సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు.

Also Read : కేసులు, గొడవలు మాకు కొత్త కాదు.. మరింత రాటుదేలుతాం- అంబటి రాంబాబు