Amjad Basha: 26 జిల్లాల్లో ప్రతీ ప్రాంతానికి అభివృద్ధి విస్తరిస్తాం – డిప్యూటీ సీఎం

ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అభినందనీయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.

Amjad Basha: 26 జిల్లాల్లో ప్రతీ ప్రాంతానికి అభివృద్ధి విస్తరిస్తాం – డిప్యూటీ సీఎం

Amzath Bhasa

Updated On : January 26, 2022 / 1:27 PM IST

AP Deputy CM Amjad Basha: ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అభినందనీయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. కొత్తగా 13జిల్లాలు ఏర్పాటయ్యాయని, ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్ధానం చేసిన విధంగా ఒక్కో హామీ ముఖ్యమంత్రి నేరవేరుస్తున్నారని అభిప్రాయపడ్డారు అంజాద్ బాషా. వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమన్నారు.

మొత్తం 26 జిల్లాల్లో ప్రతీ ప్రాంతానికి అభివృద్ధిని విస్తరిస్తామని, సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు అంజాద్ బాషా. ఇటువంటి మహత్కర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టడం హర్షణీయమని అన్నారు అంజాద్ బాషా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మూడు రాజధానులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

విభజన తర్వాత రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, దూరపు ఆలోచనతో ముఖ్యమంత్రి పాలిస్తున్నారని అన్నారు అంజాద్ బాషా. వికేంద్రీకరణతో అభివృద్ధికి నోచికొని ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయణిస్తాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే హామీ ఇచ్చారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నారని, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం మనదేనని అన్నారు.