AP EAMCET: ఆగష్టు 19 నుంచి 25 వరకు.. నోటిఫికేషన్ విడుదల

AP EAMCET: ఆగష్టు 19 నుంచి 25 వరకు.. నోటిఫికేషన్ విడుదల

Ap Eamcet

Updated On : June 24, 2021 / 7:13 PM IST

AP EAMCET: ఏపీలో ఎంసెట్ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఆగష్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు కొత్త తేదీలను ప్రకటించారు.

జూన్ 30 తేదీవరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.5000 అపరాధ రుసుముతో జులై 7 వరకు, రూ. 10వేలు అపరాధ రుసుముతో జులై 14 వరకు, రూ.15 వేలు లేట్ ఫీజుతో జులై 22 వరకు, రూ. 20 వేలు అపరాధ రుసుముతో జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

కరోనా నేపథ్యంలోనే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్కో విద్యార్థి మధ్య 5 మీటర్ల దూరం ఉండేలా సీటింగ్ సెట్ చేస్తామని, ఎగ్జామ్ సెంటర్లను శానిటైజ్ చేస్తామని ఒమర్ జలీల్ వివరించారు.