ఏపీలో కూటమి ప్రభంజనం.. పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన సత్తా

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఏకంగా 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది.

ఏపీలో కూటమి ప్రభంజనం.. పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన సత్తా

Chandrababu Naidu

Updated On : June 4, 2024 / 11:16 PM IST

AP Elections Results 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. 90శాతం సీట్లను దక్కించుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 04 Jun 2024 09:07 PM (IST)

    బాపట్ల పార్లమెంట్లో 7 స్థానాలు టీడీపీ కైవసం క్లీన్ స్విప్

    • వేమూరు టీడీపీ అభ్యర్థి నక్క ఆనంద్ బాబు 21516 ఓట్లు మెజార్టీతో గెలుపు.
    • రేపల్లె టీడీపీ అభ్యర్థి అన్న గాని సత్యప్రసాద్ 4018 ఓట్ల మెజారిటీతో గెలుపు.
    • బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేసేన నరేంద్ర వర్మ 26800 ఓట్ల మెజార్టీతో గెలుపు..
    • చీరాల టీడీపీ అభ్యర్థి మద్దలూరి మాల కొండయ్య 20558 ఓట్లు మెజార్టీతో గెలుపు
    • పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 24013 ఓట్లు మెజార్టీతో గెలుపు
    • అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవి కుమార్ 25070 ఓట్ల మెజారిటీతో గెలుపు
    • సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయకుమార్ 30,385 ఓట్లతో ఘనవిజయం

  • 04 Jun 2024 08:17 PM (IST)

    గెలిచిన నేతలు

    ఏలూరు పార్లమెంటు

    పుట్టామహేష్ కుమార్ టిడిపి 7,22,552
    మెజారిటీ: 1,67,690

    కారుమూరి సునిల్ కుమార్ వైసిపి 5,54,862

    --
    ఏలూరు బడేటి చంటి

    మెజార్టీ : 61,261

    టీడీపీ : 1,09,359

    వైసీపీ : 48,098

    --

    ఉంగుటూరు: పత్సమట్ల ధర్మరాజు

    మెజార్టీ: 44,107

    జనసేన : 1,07,281

    వైసీపీ : 63,174

    --

    పోలవరం : చిర్రి బాలరాజు

    మెజార్టీ : 7356

    జనసేన : 99,937

    వైసీపీ : 92,581

    --

    చింతలపూడి : సొంగా రోషన్

    మెజార్టీ : 26,972

    టీడీపీ : 1,18,521

    వైసీపీ : 91,549

    --

    కైకలూరు: కామినేని శ్రీనివాస్
    మెజార్టీ : 44735

    బీజేపీ : 1,08,311

    వైసీపీ 63,576

    --

    నూజివీడు: కొలుసు పార్థసారథి

    మెజార్టీ : 12,221

    టీడీపీ : 1,07,303

    వైసీపీ : 95,082

    --

    దెందులూరు: చింతమనేని ప్రభాకర్
    మెజార్టీ : 26,266

    టీడీపీ : 1,07,287

    వైసీపీ : 81,021

    --

    పశ్చిమగోదావరి జిల్లా

    నరసాపురం ఎంపీ

    బిజేపి : విజయం
    బిజేపి - భూపతిరాజు శ్రీనివాసవర్మ - 7,07,343

    వైసీపీ - గూడూరి ఉమాబాల - 4,30,541

    బిజేపి : మెజారిటీ - 2,76,802

    --

    ఆచంట పితాని సత్యనారాయణ

    మెజార్టీ : 26,076

    టిడిపి : 85,402

    వైసిపి : 58,849

    --

    పాలకొల్లు నిమ్మల రామానాయుడు

    మెజార్టీ : 63,463

    టిడిపి : 11,3114

    వైసిపి : 45,169

    --

    భీమవరం పులపర్తి రామాంజనేయులు

    మెజార్టీ : 66,974

    జనసేన : 13,0424

    వైసిపి : 63,450

    --

    నరసాపురం బొమ్మిడి నాయకర్

    మెజార్టీ : 49,096

    జనసేన : 94,116

    వైసిపి : 44,378

    --

    తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ

    మెజార్టీ : 71,059

    టిడిపి :12,9547

    వైసిపి : 57,246

    --

    ఉండి కనుమూరి రఘురామ కృష్ణంరాజు

    మెజార్టీ : 56,777

    టిడిపి : 11,6902

    వైసిపి : 60,125

    --

    తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్

    మెజార్టీ : 61,510

    జనసేన : 114955

    వైసిపి : 53,445

    --

    తూర్పుగోదావరి జిల్లా

    గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు

    మెజార్టీ : 24,784

    టిడిపి : 1,14,420

    వైసిపి : 87,636

    -

    నిడదవోలు కందుల దుర్గేష్

    మెజార్టీ : 33,304

    జనసేన : 1,02,699

    వైసిపి : 69,395

    --

    కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు

    మెజార్టీ : 33,946

    టిడిపి : 92,743

    వైసిపి : 58,797

  • 04 Jun 2024 07:35 PM (IST)

    రేవంత్ రెడ్డి అభినందనలు

    చంద్రబాబు, పవన్ కల్యాణ్ ‎కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

  • 04 Jun 2024 06:47 PM (IST)

    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజక వర్గాల వివరాలు

    • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎన్ ఈ ఆర్ 29993 ఓట్లతో గెలుపు
    • శ్రీకాకుళం టిడిపి అభ్యర్ధి గోండు శంకర్ 52458 ఓట్లతో గెలుపు
    • పాలకొండ జనసేన్ 13291 ఓట్లతో గెలుపు
    • ఆమదాలవలస టిడిపి అభ్యర్థి కూన రవికుమార్ 33183 ఓట్లతో గెలుపు
    • నరసన్నపేట టిడిపి అభ్యర్ధి బగ్గు రమణ మూర్తి 29371 ఓట్లతో గెలుపు
    • టెక్కలి టిడిపి అభ్యర్థి కింజరాపు అచ్చెన్న 34,435 ఓట్లతో గెలుపు
    • పలాస టిడిపి అభ్యర్థి శిరీష 42,194 ఓట్లతో గెలుపు
    • రాజాం టిడిపి కొండ్రు మురళీ మోహన్ 19,353 ఓట్లతో గెలుపు
    • ఇచ్చాపురం టిడిపి బెందళం అశోక్ 38,608 ఓట్ల తో గెలుపు
    • పాతపట్నం టిడిపి మామిడి గోవింద రావు 24,423 ఓట్లతో గెలుపు
    • శ్రీకాకుళం ఎంపీ టిడిపి కింజరాపు రామ్మోహన్ నాయుడు 3,61,563 ఓట్లతో ఆధిక్యం

  • 04 Jun 2024 05:58 PM (IST)

    రఘురామ కృష్ణరాజు ట్వీట్

  • 04 Jun 2024 05:39 PM (IST)

    విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ రికార్డు

    విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ రికార్డు సృష్టించారు. నాలుగు లక్షల ఇరవై వేలకు పైగా మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇంకా 10 రౌండ్ల ఫలితాలు మిగిలి ఉన్నాయి.

  • 04 Jun 2024 05:11 PM (IST)

    ఈ నేతకి ఎంత మెజార్టీ

    ఏలూరు గెలుపు- బడేటి చంటి

    మెజార్టీ : 61,261

    టీడీపీ : 1,09,359

    వైసీపీ : 48,098

    ఉంగుటూరు: పత్సమట్ల ధర్మరాజు

    మెజార్టీ: 44,107

    జనసేన : 1,07,281

    వైసీపీ : 63,174

    పోలవరం : చిర్రి బాలరాజు

    మెజార్టీ : 7356

    జనసేన : 99,937

    వైసీపీ : 92,581

    చింతలపూడి : సొంగా రోషన్

    మెజార్టీ : 26,972

    టీడీపీ : 1,18,521

    వైసీపీ : 91,549

    కైకలూరు: కామినేని శ్రీనివాస్
    మెజార్టీ : 44735

    బీజేపీ : 1,08,311

    వైసీపీ 63,576

    నూజివీడు: కొలుసు పార్థసారథి

    మెజార్టీ : 12,221

    టీడీపీ : 1,07,303

    వైసీపీ : 95,082

    దెందులూరు: చింతమనేని ప్రభాకర్
    మెజార్టీ : 26,266

    టీడీపీ : 1,07,287

    వైసీపీ : 81,021

  • 04 Jun 2024 04:00 PM (IST)

    రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి విజయం సాధించారు.

  • 04 Jun 2024 03:55 PM (IST)

    పులివెందుల నియోజకవర్గంలో సీఎం  జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు.

  • 04 Jun 2024 03:38 PM (IST)

    కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్ధి అమిలినేని సురేంద్రబాబువిజయం సాధించారు. వైసీపీ అభ్యర్ధిపై 37,011 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
    సాలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి గుమ్మిడి సంధ్యారాణి 13,071 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:42 PM (IST)

    పవన్ కల్యాణ్ ఘన విజయం..

    పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో పవన్ విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:40 PM (IST)

    రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి పరిటాల సునీత విజయం సాధించారు. 22,196 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై గెలుపొందారు.

  • 04 Jun 2024 02:34 PM (IST)

    మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయం సాధించారు.

    గుంటూరు తూర్పులో టీడీపీ అభ్యర్ధి మహ్మద్ నజీర్ విజయం సాధించారు.
    అనంతపురం పట్టణంలో టీడీపీ అభ్యర్ధి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విజయం సాధించారు.
    డోన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:31 PM (IST)

    వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి విజయం సాధించారు.
    మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
    కడప నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి మాధవి రెడ్డి విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:25 PM (IST)

    వైసీపీ అభ్యర్ధి కార్యాలయంపై రాళ్ల దాడి..

    తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కారుతోపాటు వైసీపీ ప్రచార రథంనుకూడా ధ్వంసం చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యేగా 33వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపొందారు.

  • 04 Jun 2024 02:08 PM (IST)

    ఉండిలో రఘురామకృష్ణరాజు విజయం.

    పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:06 PM (IST)

    గుంటూరు జిల్లాలో విడుదల రజిని కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు అభిమానులు హల్ చల్..

    కార్యాలయం ముందు ఉన్న వైసీపీ జెండాను పీకిన టీడీపీ కార్యకర్తలు..

    పోలీసులు వారిస్తున్నా ఆగని వైనం ..

  • 04 Jun 2024 02:03 PM (IST)

    ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. అసెంబ్లీతోపాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. టీడీపీ కూటమి దూకుడుకు ఆరు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

  • 04 Jun 2024 01:58 PM (IST)

    ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్ విజయం సాధించారు.
    బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర కుమార్ జయకేతనం ఎగురవేశారు.

  • 04 Jun 2024 01:56 PM (IST)

    మంగళగిరిలో నారా లోకేశ్ విజయం.

    మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ విజయం సాధించారు. తన సమీప పత్యర్థి, వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేశ్ ఘన విజయం సాధించారు.

  • 04 Jun 2024 01:55 PM (IST)

    ప్రధాని మోదీ, అమిత్ షాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు.

  • 04 Jun 2024 01:28 PM (IST)

    పిఠాపురంలో 11 రౌండ్లు ముగిసే సమయానికి 50వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్

  • 04 Jun 2024 01:23 PM (IST)

  • 04 Jun 2024 01:09 PM (IST)

    జగన్ రాజీనామా..

    సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. సీఎం పదవికి రాజీనామా సమర్పించనున్నారు.

  • 04 Jun 2024 01:07 PM (IST)

    చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ.

  • 04 Jun 2024 01:05 PM (IST)

    భారీ ఆధిక్యంలో పురందేశ్వరి ..

    రాజమహేంద్రవరం బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పై 2లక్షల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 12:30 PM (IST)

    అనంతపురం జిల్లాలో..

    అర్బన్ నియోజక వర్గంలో 12రౌండ్లు పూర్తి అయ్యేసరికి 16,752ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి దగ్గుబాటి వెంకట ప్రసాద్ కొనసాగుతున్నాడు

    శింగనమల నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణి 4,883ఓట్ల ఆధిక్యం.

    తాడిపత్రి నియోజక వర్గంలో 10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 8,723ట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్తి జేసి అస్మిత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నాడు

    గుంతకల్ నియోజక వర్గంలో 9 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 920 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి వై.వెంకటరామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఉరవకొండ నియోజక వర్గంలో 12 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 16,752ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు

    కళ్యాణదుర్గం నియోజక వర్గంలో ఎనిమిది రౌండ్లు పూర్తి అయ్యేసరికి 11,044 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి అమ్మిలినేని సురేంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

    రాయదుర్గం నియోజక వర్గంలో 12రౌండ్లు పూర్తి అయ్యే సరికి టీడీపీ అభ్యర్ధి కాలవ శ్రీనివాసులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    రాప్తాడు నియోజక వర్గంలో 12 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 11,406ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి పరిటాల సునీత కొనసాగుతున్నారు

  • 04 Jun 2024 12:10 PM (IST)

    ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపు

    రాజమండ్రి సిటీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై 55వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

  • 04 Jun 2024 11:41 AM (IST)

    ఏపీలో తొలి ఫలితం.. బుచ్చయ్య చౌదరి విజయం

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వచ్చేసింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 61వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి గెలుపొందారు.

  • 04 Jun 2024 11:19 AM (IST)

    చంద్రబాబు ఇంటికి చేరుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు.

    భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు.

    చంద్రబాబుని కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను

  • 04 Jun 2024 11:10 AM (IST)

    తిరగబడ్డ ‘రాయలసీమ' ఫలితం

    గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల నుంచి 52 సీట్లకుగాను వైసీపీకి ఏకంగా 49సీట్లురాగా, ఈసారి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లాలోనూ ఆరు చోట్ల వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. నాలుగు జిల్లాల్లో 40కిపైగా స్థానాల్లో కూటమి నేతలు లీడింగులో కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సరికి దాదాపుగా ఇవే రిజల్ట్స్ ఉంటాయని అంచనా.

  • 04 Jun 2024 10:50 AM (IST)

    హిందూ పురం అసెంబ్లీ నియోజకవర్గంలో 7వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ

  • 04 Jun 2024 10:43 AM (IST)

    అనంతపురం జిల్లాలో ..

    అనంత‌పురం అర్బన్ నియోజక వర్గం నాలుడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్తి దగ్గుబాటి వెంకట ప్రసాద్ 3,600 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నాడు
    శింగనమల నియోజక వర్గంలో 2వ రౌండ్ పూర్తి అయ్యేసరికి టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణి 1,744 ఓట్ల ఆధిక్యం.
    తాడిపత్రి నియోజక వర్గంలో రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 126 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి జేసి అస్మిత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నాడు
    గుంతకల్ నియోజక వర్గంలో మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి 105 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి వై.వెంకటరామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
    ఉరవకొండ నియోజక వర్గంలో మూడు రౌండ్ పూర్తి అయ్యేసరికి 4,660 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
    కళ్యాణదుర్గం నియోజక వర్గంలో నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి 6,700 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి అమ్మిలినేని సురేంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు
    రాయదుర్గం నియోజక వర్గం ఆరు రౌండ్ల‌ పూర్తి అయ్యే సరికి 9,754 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్ధి కాలవ శ్రీనివాసులు కొనసాగుతున్నారు.
    రాప్తాడు నియోజకవర్గంలో నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,650 ఓట్ల ఆధిక్యంలో టిడిపి అభ్యర్థి పరిటాల సునీత కొనసాగుతున్నారు

  • 04 Jun 2024 10:36 AM (IST)

    దశాబ్దాల నిరీక్షణ.. మంగళగిరిలో టీడీపీ జెండా రెపరెపలు

    గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో 15వేలకుపైగా మెజార్టీలో లోకేశ్ కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. 15సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే. చివరిసారిగా 1985లో టీడీపీ ఇక్కడ గెలిచింది. నారా లోకేశ్ గెలుపుతో టీడీపీకి కొరకరాని కొయ్యగాఉన్న ఈ నియోజకవర్గం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.

  • 04 Jun 2024 10:32 AM (IST)

    టీడీపీ శ్రేణుల సంబరాలు ..

  • 04 Jun 2024 10:31 AM (IST)

    ధర్మాన సోదరుల వెనుకంజ

    శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది.

    శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా YCP తరఫున బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై TDP అభ్యర్థి గొండు శంకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    నరసన్నపేట నుంచి బరిలో దిగిన YCP అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ పై  TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    జిల్లాలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది.

    మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

     

  • 04 Jun 2024 10:27 AM (IST)

    కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ.

    ఏపీలో కౌంటింగ్ కొనసాగుతోంది... టీడీపీ కూటమి హవా కొనసాగుతుంది. వల్లభనేని వంశీ, కొడాలి నానికూడా వెనుకంజలో ఉన్నారు. దీంతో మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటకు వెళ్లిపోయారు.

     

  • 04 Jun 2024 10:18 AM (IST)

    మంత్రులకు షాక్.. అందరూ వెనుకంజే

    ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది.

    దాదాపు అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

    టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వైసీపీ మంత్రులు, సీనియర్లకు షాక్ ఇస్తున్నారు.

    అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతోంది.

    పలువురు వైసీపీ అభ్యర్థులు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు.

  • 04 Jun 2024 10:17 AM (IST)

    చిత్తూరు జిల్లా..
    కుప్పంలో 893ఓట్ల మెజారిటీలో టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు.
    గట్టి పోటీఇస్తున్న వైసీపీ అభ్యర్థి భరత్.

  • 04 Jun 2024 10:12 AM (IST)

    సీఎం జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 10:04 AM (IST)

    గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థి వెనిగళ్ళ రాము 13085 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

    గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకంజలో ఉన్నారు

    గన్నవరంలో వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు.

  • 04 Jun 2024 09:40 AM (IST)

    పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యం. మొదట రౌండ్ పూర్తయ్యేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1881 ఓట్ల మెజార్టీ.

  • 04 Jun 2024 09:38 AM (IST)

    ఏపీలో వెనుకబడిన మంత్రులు..

    ఏపీలో ఎన్నికల ఫలితాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఆర్కే రోజా, చెల్లబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 09:21 AM (IST)

    రెండవ రౌండ్ లో 4300 లీడ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

  • 04 Jun 2024 09:17 AM (IST)

    ఆధిక్యంలో కూటమి అభ్యర్థులు

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 48చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 39చోట్ల టీడీపీ, ఏడు చోట్ల జనసేన, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

    ఏపీలో లోక్ సభలో 14చోట్ల ఆధిక్యంలో కూటమి అభ్యర్థులు

  • 04 Jun 2024 09:06 AM (IST)

    పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధిక్యం.

  • 04 Jun 2024 09:01 AM (IST)

    గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ.
    తిరుపతి లోక్ సభలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం.

  • 04 Jun 2024 08:59 AM (IST)

    విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యం.
    జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ముందంజ.
    తిరువూరులో టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ ముందంజ.
    చిత్తూరులో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ ఆధిక్యం.
    తెనాలిలో జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ ముందంజ.

  • 04 Jun 2024 08:53 AM (IST)

    రాజమండ్రిలో పురంధేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. 1,973 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
    నరసరావుపేటలో ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. 503 ఓట్ల ఆధిక్యం.
    అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి సీఎం రమేశ్ ఆధిక్యం.
    మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ముందంజ.
    అమలాపురంలో టీడీపీ అభ్యర్థి హరీశ్ ఆధిక్యం
    నంద్యాలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యం
    విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని చిన్ని ముందంజ

  • 04 Jun 2024 08:51 AM (IST)

  • 04 Jun 2024 08:46 AM (IST)

    పిఠాపురంలో తొలిరౌండ్ లో జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ ముందంజ.

    పిఠాపురంలో ఎక్కువగా చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు .

  • 04 Jun 2024 08:42 AM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో ఆల్యస్యమవుతున్న కౌంటింగ్... విడుదలకాని మొదటి రౌండ్ ఫలితాలు

  • 04 Jun 2024 08:41 AM (IST)

    టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు

    పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్‌లో టీడీపీ ఏజెంట్‌ రమేశ్‌కు గుండెపోటు
    నర్సరాపుపేట జేఎన్టీయూ కౌంటింగ్‌ కేంద్రంలో ఘటన
    108లో ఆస్పత్రికి తరలించి చికిత్స

  • 04 Jun 2024 08:40 AM (IST)

    కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధిక్యం..

  • 04 Jun 2024 08:28 AM (IST)

    అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎన్నికల కేంద్రంలో కౌంటింగ్ సిబ్బంది నిరసన. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని,  టిఫిన్ కూడా పెట్టలేదంటూ ప్లేట్లతో నిరసన.

  • 04 Jun 2024 08:27 AM (IST)

    రాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఆధిక్యం.

    గోరంట్ల బుచ్చయ్య చౌదరి 900 ఓట్ల ఆధిక్యం.

  • 04 Jun 2024 08:24 AM (IST)

    ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను డీజీపీ కార్యాలయం నుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
    ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఫోకస్‌
    రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలంటూ వార్నింగ్.
    బెదిరింపు పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం.
    కేసులు నమోదు చేసి రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం
    అడ్మిన్ లు అలర్ట్ గా ఉండాలి

  • 04 Jun 2024 08:19 AM (IST)

    ఈవీఎంలలో ఒక్కో రౌండ్ కు 20 నుంచి 25 నిమిషాలు సమయం పడుతుంది. మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత రానుంది.

  • 04 Jun 2024 08:16 AM (IST)

    ఏపీలో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం నియోజకవర్గాల ఫలితం రానుంది. అన్నింటికంటే చివర్లో అమలాపురం నియోజకవర్గం ఫలితం రానుంది.

  • 04 Jun 2024 08:12 AM (IST)

    ఏపీలో కౌంటింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది లెక్క ఇలా..

    రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కోసం EC 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తోంది.
    కౌంటింగ్ ను పరిశీలించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఏపీకి వచ్చారు.
    ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 మంది పోలీస్ సిబ్బంది, 67 కంపెనీల సాయుధ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
    సెంటర్ల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది.
    ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తున్నారు.

  • 04 Jun 2024 08:09 AM (IST)

    కడప జిల్లా..
    ఏజెంట్ల సమక్షంలో కడపలో అబ్దుల్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీ స్ట్రాంగ్ రూములను తెరిచిన అధికారులు.
    అన్నమయ్య జిల్లా రాయచోటి సాయి ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూములు తెచ్చిన అధికారులు

    కడప జిల్లాలో.. 

    కమలాపురం రౌండ్స్ 18
    పోలింగ్ స్టేషన్స్ 251

    ప్రొద్దుటూరు రౌండ్స్ 20.
    పోలింగ్ స్టేషన్స్ 268

    మైదుకూరు రౌండ్స్ 20.
    పోలింగ్ స్టేషన్స్ 269

    బద్వేల్ రౌండ్స్ 20
    పోలింగ్ స్టేషన్స్ 272

    కడప రౌండ్స్ 21
    పోలింగ్ స్టేషన్స్ 287

    పులివెందుల రౌండ్స్ 22
    పోలింగ్ స్టేషన్స్ 301

    జమ్మలమడుగు రౌండ్స్ 23.
    పోలింగ్ స్టేషన్స్ 315

     

  • 04 Jun 2024 08:05 AM (IST)

    ఏపీలో కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

  • 04 Jun 2024 08:04 AM (IST)

    తిరుపతి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, కాళహస్తి అభ్యర్థులు బొజ్జల సుధీర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి.

  • 04 Jun 2024 07:59 AM (IST)

  • 04 Jun 2024 07:52 AM (IST)

    తెల్లవారుజామున 5గంటలకు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ..

    ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అయితే, ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో పాటు మూడు పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..  వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 04 Jun 2024 07:50 AM (IST)

    ఏపీలో కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు.. క్షుణ్ణంగా తనిఖీలు.
    మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ.
    రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద హడావుడి వాతావరణం.
    ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు.
    వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది.
    పేపర్, పెన్నులు/ పెన్సిళ్లు మినహా వేటిని లోపలికి అనుమతించడం లేదు.
    సమస్యాత్మక పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు.

  • 04 Jun 2024 07:02 AM (IST)

    తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఫలితాలను పరిశీలించనున్న సీఎం జగన్.
    తాడేపల్లి లోని వార్ రూమ్ నుంచి ఫలితాలు పరిశీలించనున్న కీలక నేతలు.
    పార్టీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు.
    పార్టీ కార్యాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా భద్రత ఏర్పాటు.
    చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు

  • 04 Jun 2024 06:57 AM (IST)

    ప్రకాశం జిల్లాలో..

    సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ‌మైంది.
    ప్రతి నియోజకవర్గంలో టేబుల్స్ వారీగా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు.
    ఎన్నికల అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ.ఎస్. దినేష్ కుమార్.

  • 04 Jun 2024 06:55 AM (IST)

  • 04 Jun 2024 06:44 AM (IST)

    టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రత..

    అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం చుట్టూ భద్రత ఏర్పాటుతో పాటు.. పార్టీ కార్యాలయానికి వచ్చే దారిలోనూ భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ ఫలితాల నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పటికప్పుడు ఫలితాలు వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయంకు రానుండడంతో టీడీపీ నేతలు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయంకు నారా లోకేశ్ రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కౌంటింగ్ ను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మానిటరింగ్ చేయనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతోపాటు సీనియర్ నేతలుకూడా పార్టీ కార్యాలయంకు రానున్నారు.

  • 04 Jun 2024 06:37 AM (IST)

    విశాఖలో..

    విశాఖలో కౌటింగ్ ఎర్పాట్లు పూర్తయ్యాయి. ఏజెంట్లు, కౌటింగ్ సిబ్బంది, ఎమ్మెల్యేలు ఏయు ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 04 Jun 2024 06:36 AM (IST)

    ఒంగోలు లోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఏజెంట్లు.

  • 04 Jun 2024 06:34 AM (IST)

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యంగా రానున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అందుకు తొమ్మిది నుంచి పది గంటల సమయం పడుతుంది.

  • 04 Jun 2024 06:30 AM (IST)

    తొలి ఫలితం ఆ రెండు నియోజకవర్గాల్లో..

    ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో దాగిన ఓటరు తీర్పు మరికొద్ది సేపట్లో వెల్లడి కానుంది. కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన 5 గంటల్లోనే ఈ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి ఫలితం వెల్లడి కానుంది.