AP Govt : ఏపీలో వరదల బీభత్సంపై ప్రభుత్వం ప్రకటన

భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలో వరదల బీభత్సంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

AP Govt : ఏపీలో వరదల బీభత్సంపై ప్రభుత్వం ప్రకటన

Ap Govt (1)

Updated On : November 21, 2021 / 12:00 AM IST

heavy rains and floods : భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలో వరదల బీభత్సంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వరదలతో నాలుగు జిల్లాలు అతలాకుతలం అయ్యాయని తెలిపింది.

నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు భారీ నష్టం జరిగింది. వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందినట్లు పేర్కొంది. కడప జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో ఏడుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు చనిపోయినట్లు ప్రకటించారు. 17 మంది గల్లంతైనట్లు ప్రకటించింది.

Floods In Kadapa : కడప జిల్లాలో వరదలు..పూజలకు వెళ్లి 16 మంది గల్లంతు, ప్రాణాలు కోల్పోయిన వేలాది మూగజీవాలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు మొత్తం 2.33 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రకటించింది. 19,645 హెక్టార్లలో ఉద్వాన పంటలకు నష్టం జరిగిందని వెల్లడించింది. రూ.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. పౌల్ట్రీ రంగానికి రూ.2.31 కోట్ల మేర నష్టం జరిగింది.