ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ తొలి విడత డబ్బులు వచ్చేస్తున్నాయ్.. మీ బ్యాంకు ఖాతాల్లో..
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ..

AP Govt Annadata Sukhibhava: ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కోటి అమలు చేస్తోంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
Also Read: Pawan Kalyan : వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రతియేటా రైతులకు రూ.6వేలు మూడు విడతలుగా జమ చేస్తుంది. దీనికి జతగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.14వేలు అందిస్తామని ప్రకటించింది. అయితే, 14వేలను రెండు విడతల్లో రూ.7వేల చొప్పున ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఈ నెలాఖరులో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7వేలు జమ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read: సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం.. తనపై పెట్టిన కేసు గురించి కీలక ప్రశ్నలు
వాస్తవానికి.. అన్నదాత సుఖీభవ పథకంను పీఎం కిసాన్ యోజన పథకంతోపాటు ఈనెల 20న అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కేంద్రం జూన్ 20న పీఎం కిసాన్ యోజన 20వ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులను విడుదల చేయలేదు. దీంతో అన్నదాత సుఖీభవ పథకం అమలు కూడా వాయిదా పడింది. ఈనెల చివరి నాటికి పీఎం కిసాన్ యోజన నిధులు జమ చేసేందుకు కేంద్ర సిద్ధమవుతుండటంతో.. అన్నదాత సుఖీభవ పథకం నిధులనుకూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీవ్యాప్తంగా మొత్తం 45.71 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. తొలి విడతగా జూన్ నెలాఖరులో రూ.7000, అక్టోబర్ నెలలో రెండో విడతలో రూ. 7 వేలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.