3 రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం అందిస్తున్న పాలనను అభినందించారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని వికేంద్రీకరణపై గవర్నర్ మాట్లాడారు. మూడు రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది, అధికార వికేంద్రీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని గవర్నర్ చెప్పారు. దీంతో మూడు రాజధానులకు ఆయన మద్దతిచ్చినట్టు అయ్యింది.
నవరత్నాలతో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ కితాబిచ్చారు. రైతులకు నేస్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3వేల కోట్ల నిధి ఏర్పాటు చేశారన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రూ.13వేల 500 అందుతోందన్నారు. రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. 100 శాతం అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని చెప్పారు. సచివాలయాల ద్వారా 4 లక్షలు ఉద్యోగాలు లభించాయన్నారు.
గవర్నర్ ప్రసంగం:
* ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది
* ఆరోగ్యశ్రీ, అమ్మఒడి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి
* అన్ని వర్గాల హక్కులకు భారత రాజ్యాంగం రక్షణగా నిలిచింది
* అభివృద్ధి, అధికార వికేంద్రీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం
* నవరత్నాలతో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోంది
* గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది
* సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయి
* సచివాలయాల ద్వారా 4 లక్షల ఉద్యోగాలు లభించాయి
* ఏపీ ప్రభుత్వం రైతు నేస్తంగా ఉంది
* రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 సాయం
* ధరల స్థిరీకరణ కోసం రూ.3వేల కోట్ల నిధి ఏర్పాటు
* రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా
* 100 శాతం అక్ష్యరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోంది
* ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం
* ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి
* మనబడి, నాడు-నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ది
* ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరుస్తూ నిర్ణయం