ఏపీలో బార్లకు అనుమతి.. లైసెన్స్ ఛార్జీలు 10 శాతం పెంపు

  • Published By: sreehari ,Published On : September 18, 2020 / 09:28 PM IST
ఏపీలో బార్లకు అనుమతి.. లైసెన్స్ ఛార్జీలు 10 శాతం పెంపు

Updated On : September 18, 2020 / 10:18 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం (సెప్టెంబర్ 19) నుంచి బార్లు తెరుచు కోనున్నాయి. ఏపీ ప్రభుత్వం బార్లను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఏపీలో బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



2021 జూన్ 30 వరకు బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్ ఫీజుగా బార్ లైసెన్స్ ఫీజులోని 20 శాతం మొత్తాన్ని అబ్బారీ శాఖ వసూలు చేయనుంది.

విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర AERT విధిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.



2020-2021 ఆర్థిక సంవత్సరానికి కోవిడ్ ఫీజుగా బార్ లైసెన్స్ ఫీజులోని 20 శాతం మొత్తాన్ని అబ్బారీ శాఖ వసూలు చేయనుంది.



840 బార్ల లైసెన్సులను కొనసాగించాలని అబ్బారీ శాఖ నిర్ణయించింది. బార్లలో మద్యం విక్రయాలపై అదనపు రిటైల్ ట్యాక్స్ 10 శాతం పెంచుతున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది.