Nara Bhuvaneshwari : జైల్లో నా భర్తకు అవసరమైన అత్యవసర వైద్యం సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలం : నారా భువనేశ్వరి

తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని వెల్లడించారు.

Nara Bhuvaneshwari : జైల్లో నా భర్తకు అవసరమైన అత్యవసర వైద్యం సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలం : నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari (2)

Updated On : October 13, 2023 / 12:52 PM IST

Nara Bhuvaneshwari – AP Govt : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తన భర్త (చంద్రబాబు) ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తన భర్తకు అవసరమైన అత్యవసరంగా వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైoదని విమర్శించారు. తన భర్త క్షేమంపై తాను చాలా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికంగా స్పందించారు.

తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని వెల్లడించారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని వాపోయారు.

AP High Court : అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

మరోవైపు చంద్రబాబు తనకు స్కిన్ కంప్లయింట్ ఉందని చెప్పారు.. ముందు జైల్లో ఉన్న డాక్టర్లు పరిశీలించారని కోస్తాంధ్ర జైళ్ళ శాఖ డీఐజీ రవి కిరణ్ పేర్కొన్నారు. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజమండ్రి జీజీహెచ్ సూపరిడెంట్ కి సమాచారం ఇచ్చామని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి డెర్మటాలజిస్ట్ వచ్చి చంద్రబాబును పరిశీలించారని వెల్లడించారు.

కొన్ని మందులు రిఫర్ చేశారని, అవి వాడుతున్నారని, చంద్రబాబు హెల్త్ కండిషన్ నార్మల్ గానే ఉందన్నారు. వైద్యులు ఏసీ ఇవ్వమని చెప్పలేదని వెల్లడించారు. నిబంధనల ప్రకారం పని చేస్తున్నామని చెప్పారు. డీ హైడ్రేషన్ గా ఉందని చంద్రబాబు చెప్పారని.. ఓఆర్ఎస్ వాడుతున్నారని తెలిపారు.