మళ్లీ ఓల్డ్ బ్రాండ్లు..! మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు వేలం పాట ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.

Ap Liquor Policy : ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకుని పాలసీని రూపొందిస్తోంది. మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా బ్రాండెడ్ మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులతో చర్చలు జరుపుతోంది.
వేలం పాట ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలు..
కొత్త మద్యం పాలసీ విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేసేలా ఏపీ సర్కార్ కార్యాచరణ రూపొందించనుంది. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఎలా ఉన్నాయి, ఆ పాలసీ అమలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటి ద్వారా ఉండే ప్రయోజనాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు వేలం పాట ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అలాగే మద్యం విక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా చేయాలని ప్రభుత్వం దృష్టి సారించింది.
మళ్లీ అందుబాటులోకి ప్రముఖ బ్రాండ్ల లిక్కర్..
కొత్త ఎక్సైజ్ విధానం తీసుకొచ్చే నాణ్యమైన బ్రాండ్లతో పాటు ధరలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకునేలా పాలసీని రూపొందిస్తోంది. బ్రాందీ, విస్కీ, బీర్ లలో గతంలో ఉన్న బ్రాండ్లను, ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న బ్రాండ్లను విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది. తక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా కొత్త ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల కాలంలో అందుబాటులో లేకుండా పోయిన ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ఏపీలో తిరిగి అందుబాటులోకి రానుంది.
Also Read : షాకింగ్.. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి.. గవర్నర్‌ను విమర్శిస్తుండగా ఘటన..