ఇంటి దగ్గరే పరీక్షా కేంద్రాలు, పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల

కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించబోతుంది. విద్యార్థుల ఇళ్ల సమీపంలోనే ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పట్టణాలు, నగరాల్లో హాస్టల్స్ లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులు లాక్ డౌన్ తో స్వస్థలాలకు వెళ్లారు. ప్రస్తుతం వారంతా అక్కడే ఉంటున్నారు. చదివిన పాఠశాల ప్రకారం ఎగ్జామ్ సెంటర్స్ ను కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి వారం పాటు ఉండాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా సమస్య కానుంది. ఇందులో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు, విద్యార్థుల సౌకర్యార్థం వారి నివాసానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. మార్చి నెలాఖరులో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
పరీక్షల షెడ్యూల్:
జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్
జులై 11న సెకండ్ లాంగ్వేజ్
జులై 12న ఇంగ్లీష్
జులై 13న గణితం(మ్యాథ్స్)
జులై 14 సామాన్య శాస్త్రం(సోషల్)
జులై 15న సాంఘీక శాస్త్రం(సోషల్)
Read Here>> రాష్ట్రం లోపలే కాదు హైదరాబాద్‌కూ..బస్సులు నడపేందుకు అన్నీ రెడీ : మంత్రి పేర్ని నాని