Dhulipalla Narendra: ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది.

Dhulipalla Narendra: ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు

Dhulipalla

Updated On : October 27, 2021 / 10:01 AM IST

Dhulipalla Narendra: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సిక్స్ ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ ఈ నోటీసులను జారీ చేసి, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు.

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ ద్వారా డీవీసీ ఆస్పత్రి నడుస్తోండగా.. పాల రైతులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం డబ్బులకి వైద్యం అందిస్తుంది. అయితే, ఈ ట్రస్ట్‌కి ఇప్పుడు నోటీసులు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

గతంలో కూడా సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేయగా.. అప్పుడు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది.

సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు గతంలో సంస్థ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను కూడా అప్పట్లో అరెస్ట్ చేశారు. తర్వాతికాలంలో ఆయనకు బెయిల్ వచ్చింది.