ఏపీలో మందిరాలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో పాటించాల్సిన నిబంధనలు ఇవే

ఏపీలో జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 12:12 PM IST
ఏపీలో మందిరాలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో పాటించాల్సిన నిబంధనలు ఇవే

Updated On : June 6, 2020 / 12:12 PM IST

ఏపీలో జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ

ఏపీలో జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థనా స్థలాలు, మందిరాల్లో పాటించాల్సిన నిబంధనల వివరాలు విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ వాష్ తప్పనిసరి చేసింది. ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే ప్రార్థనా స్థలాలు, మందిరాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. 

ప్రార్థనా స్థలాలు, మందిరాల్లో పాటించాల్సిన నిబంధనలు:
* కరోనాపై పోస్టర్లు, వీడియో ద్వారా భక్తుల్లో అవగాహన పెంచాలి
* పాదరక్షలను ఎవరి వాహనాల దగ్గర వారే ఉంచుకోవాలి
* క్యూలైన్లలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి
* విగ్రహాలను, పవిత్ర పుస్తకాలను తాకకూడదు
* గుంపులుగా భక్తి పాటలు పాడకూడదు
* పవిత్ర జలాలు, ప్రసాదాలు పంచకూడదు
* దేవాలయాల్లో అన్నప్రసాదాలు తయారు చేసేటప్పుడు.. వడ్డించేటప్పుడు భౌతిక దూరం పాటించాలి

హోటల్స్, రెస్టారెంట్లలో అనుసరించాల్సిన నిబంధనలు:
* ప్రవేశ ద్వారం దగ్గర హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి
* మాస్కులు ఉన్న వారిని మాత్రమే హోటల్స్‌, రెస్టారెంట్లలోకి అనుమతించాలి
* హోటల్స్‌లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా గ్లౌజులు ధరించాలి
* ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు వేర్వేరుగా ఉండాలి
* హోటల్స్‌లో చెల్లింపులకు కాంటాక్ట్‌లెస్ విధానాన్ని అమలు చేయాలి
* క్లాత్ నాప్కిన్స్‌కు బదులు పేపర్ నాప్కిన్స్‌కు ఉపయోగించాలి
* మాల్స్‌లోనూ ఇవే నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు ఇచ్చిన సీఎస్ నీలం సాహ్ని

Read: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 210