AP High Court : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆ రెండు జీవోలు కొట్టివేసిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం జీవోలు 53, 54 జారీ చేసింది.

Ap High Court
AP High Court : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం జీవోలు 53, 54 జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ ను విచారించిన హైకోర్టు.. ఆయా మేనేజ్ మెంట్ల నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్త జీవోలను ఇవ్వాలని చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యాసంస్థల నిర్వహణ, మెరుగైన విద్యాబోధన సాధ్యం కాదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని.. ప్రతి ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల అభిప్రాయాలను తీసుకున్నాకే.. ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు తెలిపింది.
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజును ఖరారు చేస్తూ ఆగస్టులో ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో తెలిపింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను నిర్ణయించారు. ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ల్యాబ్ ఫీజు, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టూడెంట్ హెల్త్ కేర్, స్టడీ టూర్ ఇలా ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయి.
Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..
ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని.. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోలు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.