AP High Court : ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

AP High Court : ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Ap High Court Green Signal To Ganesh Celebrations In Private Places

Updated On : September 8, 2021 / 10:12 PM IST

AP High court green signal to Ganesh Celebrations : వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవచ్చిని హైకోర్ట్ సూచించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్‌ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. అటు పబ్లిక్‌ ప్లేస్‌లలో నవరాత్రి వేడుకలు జరుపుకోవద్దని తెలిపింది. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది.

అయితే ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం.. మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
VK SasiKala : శశికళకు షాకిచ్చిన ఐటీ శాఖ…రూ. 100 కోట్ల ఆస్తులు జప్తు

ప్రైవేటు స్థలాల్లో కోవిడ్‌ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. కోవిడ్ మూడో దశ వ్యాప్తి చెందనున్న నేపథ్యంలో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా నిబంధనలు పాటించాలని హైకోర్టు సూచించింది. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజల జీవించే హక్కునూ కాదనలేమని హైకోర్టు తెలిపింది. ప్రజారోగ్యాన్ని, వారి ప్రాణాలను భద్రతను దృష్టిలో పెట్టుకుని పబ్లిక్‌ ప్లేస్‌లలో మండపాలు ఏర్పాటు చేయరాదని హైకోర్టు సూచించింది.