Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. కేసు నమోదుకు ఆదేశాలు!
Vidadala Rajini : రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.

AP high court orders to register case against Vidadala Rajini
Vidadala Rajini : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఓ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఏపీ హైకోర్టు షాకిచ్చింది. విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా మాజీ మంత్రి రజనిపై కేసులు పెట్టాలని పల్నాడు పోలీసులను ఆదేశించింది.
Read Also : Vizag Railway zone: వైజాగ్ కేంద్రంగా కొత్త ‘సౌత్ కోస్ట్’ రైల్వే జోన్.. మొత్తం 4 డివిజన్లు..!
2019లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటూ విడుదల రజనిపై ఆరోపణలు వచ్చాయి. చిలకలూరిపేట పీఎస్‌లో ఐదురోజులపాటు చిత్రహింసలు పెట్టారంటూ బాధితుడు ఆరోపించాడు.
ఇటీవల పలుసార్లు టీడీపీ నేత పిల్లి కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో తనకు న్యాయం జరగలేదంటూ బాధితుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ క్రమంలోనే బాధితుడి పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. విడదల రజినితోపాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.
2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగా వైసీపీ తరపున విడుదల రజిని చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై మంత్రి పదవిని చేపట్టారు. రెండేళ్లకుపైగా మంత్రిగా పనిచేశారు. అప్పట్లో కోటి అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు.
Read Also : KTR : తెలంగాణలో ‘కులగణన’పై పార్లమెంట్‌నే తప్పుదోవ పట్టిస్తారా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ఆగ్రహం.. భారీ లేఖ
దాంతో తనను వేధింపులకు గురి చేశారంటూ బాధితుడు అప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారంటూ అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.