Anil Kumar Singhal : సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైపండ్ రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

Anil Kumar Singhal
Anil Kumar Singhal : ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైపండ్ రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
రాష్ట్రంలో 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కరోనా విధుల్లో ఉన్నారని ఆయన చెప్పారు.
జూనియర్ డాక్టర్లు డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. పీజీ 3 ఏళ్ళు పూర్తి చేసిన 800 మంది డాక్టర్లు కూడా స్టైఫెండ్ పెంచాలని కోరుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆందోళన విరమించుకోవాలని కోరినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 13.02 గా ఉందని ఆయన వివరించారు. గడిచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించామని… 25లక్షల మందికి పైగా రెండు డోసులు వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు.
విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధుల కోసం వ్యాక్సినేషన్ వేసే విషయంలో వారికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సింఘాల్ చెప్పారు. విదేశాలకు వెళ్లే వ్యక్తులు వారి పాస్ పోర్టు నెంబరు కూడా ఇవ్వాలని సూచించారు.
కోవిన్ యాప్ లో ఈ సదుపాయం లేకపోవటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని వాటిని సవరించే విషయమై కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులు,కోవిడ్ కేర్ సెంటర్లలో ఖాళీ పడకల సంఖ్య పెరుగుతోందని… డిశ్చార్జ్ లు పెరుగుతున్నాయని ఆయన పేర్కోన్నారు.