AP Police : నా ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడుతావా?కళ్లు నెత్తికెక్కాయా..?అంగన్వాడీ టీచర్‌పై మహిళా ఎస్ఐ జులుం
కొత్తపల్లి ఎస్ఐ ముబీనా.. దళిత మహిళ అయిన అంగన్ వాడీ టీచర్ హరితపై విరుచుకపడింది. ఏం తప్పు చేశానని టీచర్ ప్రశ్నించింది. తాను తప్పు చేయనప్పుడు స్టేషన్ కు ఎందుకు రావాలని ప్రశ్నించింది..

Women Police
Kothapalli SI : నా ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడుతావా ? ఎంత అహంకారం.. నన్ను ఎవరు అనుకుంటున్నావే..నన్నే ప్రశ్నిస్తావా ? నడువ్ పోలీస్ స్టేషన్ కు అంటూ మహిళా ఎస్ఐ జులుం. నేనేందుకు రావాలె అంటూ మరో మహిళ. అక్కడున్న మగ పోలీసులు ఏదో తింటూ.. నువ్వు ఏమీ తప్పు చేయలేదు.. కానీ స్టేషన్ కు రావాలె అంటున్నారు. ఇదేదో సినిమాలో సీన్ కాదు. రియల్ సీన్. అవును ఓ అంగన్ వాడీ టీచర్ పై మహిళా ఎస్ఐ చేసిన జులుం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఓ అంగన్ వాడీ వర్కర్ పట్ల ఎస్ఐ ఇలా వ్యవహరించడం తప్పు కాదా ? వెంటనే ఆమెను సస్పండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమె తండ్రిని కూడా స్టేషన్ కు తీసుకెళ్లి నిర్భందించడం దారుణమని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది.
Read More : Janga Reddy Gudem : స్పీకర్‌పై పేపర్లు వేసిన టీడీపీ సభ్యులు.. ఖండించిన వైసీపీ
కొత్తపల్లి ఎస్ఐ ముబీనా.. దళిత మహిళ అయిన అంగన్ వాడీ టీచర్ హరితపై విరుచుకపడింది. ఏం తప్పు చేశానని టీచర్ ప్రశ్నించింది. తాను తప్పు చేయనప్పుడు స్టేషన్ కు ఎందుకు రావాలని ప్రశ్నించింది. నన్నే ప్రశ్నిస్తావా ? అంటూ ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడుతావా ? కళ్లు నెత్తికెక్కాయా ? ఎవరితో మాట్లాడుతున్నావో కనబడడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ… జీపు ఎక్కాలని హుకుం జారీ చేసింది.
స్టేషన్ కు వెళ్లిన తర్వాత… అన్నీ చెబుతాం అని ఎస్ఐ ముబీనా తాజ్ హెచ్చరించింది. ఈ ఘటనను సెల్ లో వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా తీసుకరావాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించింది. ఇదేమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన హరిత తండ్రిని సైతం స్టేషన్ కు తీసుకెళ్లి నిర్భందించారు. అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంగన్ వాడి టీచర్ అయిన హరితను మానసిక ఒత్తిడికి గురి చేసి.. అవమాన పరిచారని వెల్లడిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు ఇవ్వలేదని, దారుణంగా ప్రవర్తించిన ఎస్ఐ ముబీనా తాజ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.