AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. 300 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్..

దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. 300 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్..

Updated On : July 19, 2025 / 8:47 PM IST

AP Liquor Scam: ఏపీలో రాజకీయంగా సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అందజేశారు సిట్ అధికారులు. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు.

దీంతోపాటు వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను జత చేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్ షీటులో వెల్లడించారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలను దీనికి జతచేశారు.

వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్ మెంట్లను కూడా స్వాధీనం చేసుకుని ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది సిట్. మద్యం ముడుపులు షెల్ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్ ను వైట్ గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ ఆయన పాత్రను మాత్రం అధికారులు పేర్కొనలేదు.

Also Read: ఏపీకి వర్ష సూచన.. 5 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని రేపు (జూలై 20) చూపనున్నారు సిట్ అధికారులు. రేపు ఉదయం మిథున్ రెడ్డి అరెస్ట్ ను సిట్ ప్రకటించనుందని సమాచారం. ఈ రాత్రికి మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలోనే ఉండనున్నారని తెలుస్తోంది.