ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం? త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికొస్తుందన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమని కొల్లు రవీంద్ర అన్నారు. రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయని చెప్పారు.

Kollu Ravindra
ఏపీ లిక్కర్ స్కాంలో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకొస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమని కొల్లు రవీంద్ర అన్నారు. రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయని, అన్ని ఆధారాలతో త్వరలో పెద్ద తిమింగళం బయటపడుతుందని తెలిపారు. గతంలో అడ్డంగా దోచుకుని జేబులు నింపుకున్నారని అన్నారు.
Also Read: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
తమ కూటమి సర్కారు వచ్చాక 500 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చిందని కొల్లు రవీంద్ర చెప్పారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి కళ్లెం వేశామని అన్నారు. రాష్ట్రంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుతుందని తెలిపారు. ఏపీలో మద్యంతో పాటు ఇంకా అనేక కుంభకోణాలు బయటికి వస్తున్నాయని అన్నారు.
కాగా, మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు.