AP Covid : ఏపీలో కొత్తగా 86 కోవిడ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది.  నిన్న కొత్తగా 86 మందికి  కోవిడ్ నిర్ధారణ అయ్యింది.

AP Covid : ఏపీలో కొత్తగా 86 కోవిడ్ కేసులు నమోదు

Ap Covid Up Date

Updated On : March 4, 2022 / 6:13 PM IST

AP Covid  : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది.  నిన్న కొత్తగా 86 మందికి  కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో   ఇంతవరకు  కోవిడ్ సోకినవారి సంఖ్య రాష్ట్రంలో 23,18,262కి చేరింది. అదే సమయంలో 288 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దీంతో ఇంతరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,02,192 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,341 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఈరోజు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న రాష్ట్రంలో కోవిడ్ మరణాలు  సంభవించలేదు.