బిల్లును అడ్డుకుంటారా? మండలి ఛైర్మన్‌పై బొత్స ఆగ్రహం

  • Published By: madhu ,Published On : January 21, 2020 / 07:57 AM IST
బిల్లును అడ్డుకుంటారా? మండలి ఛైర్మన్‌పై బొత్స ఆగ్రహం

Updated On : January 21, 2020 / 7:57 AM IST

ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న విచక్షణాధికారాలను రాజకీయా ప్రయోజనాల కోసం వినియోగించొద్దని బోత్స సూచించారు. మండలి ఛైర్మన్ పనితీరుకు మచ్చగా మిగిలిపోతుందన్నారు. మండలి ఛైర్మన్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని మంత్రి బోత్స సూచించారు. 

దీనికి శానసమండలి ఛైర్మన్ షరీఫ్ రెస్పాండ్ అయ్యారు. తనకు రాజకీయాలు ఆపాదించొద్దన్నారు. కేవలం నిబంధనల ప్రకారమే తాను వ్యవహరిస్తున్నట్లు ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. బోత్స చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 

2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ఎలాగైనా పాస్ చేయించుకోవాలని అధికారపక్షం ఉంటే..శాసనమండలిలో ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ప్రయోగించిన రూల్ 71 కింద చర్చకు మండలి ఛైర్మన్ షరీఫ్ అనుమతించడంపై ఏపీ మంత్రులు కారాలు మిరియాలు నూరుతున్నారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను వాయిదా వేశారు మండలి ఛైర్మన్ షరీఫ్. 

 

శాసనమండలిలో బలబలాలు :-
మండలిలో వైసీపీ సభ్యుల బలం 9 మంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణ రాజు వైసీపలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ బలం 10కి చేరుకుంది. కానీ టీడీపీ మండలిలో బలం ఏకంగా 32 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదొం పొందుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. టీచర్ ఎమ్మెల్సీలు ఐదుగురు, ఇండిపెండెంట్ సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తుందని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. మండలిలో బిల్లులు పాస్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

శాసనమండలిలో 58 మంది సభ్యులున్నారు. 
టీడీపీ -28, వైసీపీ -9, బీజేపీ 2, పీడీఎఫ్ 5, నామినేటెడ్ సభ్యులు – 8. 
స్వతంత్రులు 3, ఖాళీలు -3. 

Read More : శానసమండలి మరోసారి వాయిదా : మండలి ఛైర్మన్‌పై మంత్రుల అభ్యంతరం