చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ

చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ

Updated On : January 23, 2021 / 6:20 PM IST

AP Minister Peddireddy criticizes SEC Nimmagadda Ramesh : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. అయినా నిమ్మగడ్డ పట్టించుకోలేదని మండిపడ్డారు.

ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ విధుల్లో ఉన్నారని.. ఇలాంటి సమయంలో ఆఘమేఘాల మీద ఎన్నికలకు పోవడం దురదృష్టకరమన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో కొందరు జగన్‌పై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ చిచ్చు రాజేసింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని పాలక వైసీపీ తప్పుబడుతుండగా.. ప్రతిపక్ష టీడీపీ స్వాగతించింది. ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ విధుల్లో ఉన్నారని.. ఇలాంటి సమయంలో ఆఘమేఘాల మీద ఎన్నికలకు పోవడం దురదృష్టకరమన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ ఉన్నారని వారు ఆరోపించారు.

ఇటు టీడీపీ నేతలు మాత్రం ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని … అందుకే వాటిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు టీడీపీ నేతలు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.