Minister Roja : నాకు కాకపోతే వారిద్దరికిస్తారా?.. నగరిలో పోటీపై మంత్రి రోజా ఆక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు.

Minister Roja : నాకు కాకపోతే వారిద్దరికిస్తారా?.. నగరిలో పోటీపై  మంత్రి రోజా ఆక్తికర వ్యాఖ్యలు

Minister Roja

Updated On : December 19, 2023 / 12:28 PM IST

Andhrapradesh : ఏపీ మంత్రి రోజా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకుంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవ చేసే శక్తి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీకి 175 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి ఎవరైనా బయటికి పోతే వారిని లాక్కొని సీట్లు ఇవ్వాలని గోతికాడ గుంటనక్కల్లా కాచుకొని ఉన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గంలో మళ్లీ పోటీచేసే విషయంపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : KTR : కర్ణాటక సీఎం వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో జగన్ మోహన్ రెడ్డి ఇన్ ఛార్జిల మార్పులు చేర్పులు చేశారు. మరో జాబితాకూడా సిద్ధమవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా, కుప్పం మినహా మిగిలిన 13 చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. తాజాగా ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు.

Also Read : CM Jagan : ఆ ఐదుగురికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్

నగరి నియోజకవర్గంలో నాకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరన్న శునకానందం కొంతకాలం మాత్రమేనని మంత్రి రోజా అన్నారు. నగరిలో నాకు సీటు ఇవ్వకుంటే ఆ రెండు పత్రికల యాజమానులకు ఇస్తారా? అంటూ విమర్శించారు. నేను జగనన్న సైనికురాలిని.. ఎవరికి సీటు ఇచ్చినా పర్వాలేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని రోజా దీమా వ్యక్తంచేశారు.