KTR : కర్ణాటక సీఎం వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్నో హామీలు ఇస్తాం..

KTR : కర్ణాటక సీఎం వీడియోను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా?

KTR Tweet

KTR Tweet : తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఓ ప్రశ్న సంధించారు. ఇందుకు ప్రధాన కారణం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. హామీల అమలుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

Also Read : క్యాబినెట్‌లోకి ఆ ఆరుగురు? ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? అని పేర్కొన్నట్లు ఉంది. ఈ వీడియోను కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు.. అలాంటప్పుడు హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా? అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Also Read : ఐదుగురు సిట్టింగుల సీట్లు గల్లంతు? కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌