CM Revanth Reddy : క్యాబినెట్‌లోకి ఆ ఆరుగురు? ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చలు

ఇక మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురిని తీసుకునే ఛాన్స్ ఉందని, పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత పేర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

CM Revanth Reddy : క్యాబినెట్‌లోకి ఆ ఆరుగురు? ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చలు

CM Revanth Reddy Delhi Tour

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (డిసెంబర్ 19) ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపైన పార్టీ హైకమాండ్ తో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇక మంత్రివర్గంలోకి కొత్తగా ఆరుగురిని తీసుకునే ఛాన్స్ ఉందని, పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత పేర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.

Also Read : రివెంజ్ పాలిటిక్స్.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యూహం..!

మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజు రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. 6 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా పార్టీలో ఎవరికి అవకాశం కల్పించాలి? అనేదానిపై హైకమాండ్ తో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇక కేబినెట్ విస్తరణపైనా రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా పోటీ.. పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు

మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలి? అనే దానిపైనా చర్చించబోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈ నాలుగు జిల్లాల నుంచి ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి? అనేదానిపై రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు అని తెలుస్తోంది.