AP politics : టీడీపీ ఆపరేషన్ గుడివాడ .. కొడాలి నానికి చెక్ పెట్టటానికి చంద్రబాబు ప్లాన్ .. రంగంలోకి ఎన్నారై
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేత కొడాలి నానికి చెక్ పెట్టటానికి టీడీపీ ఆపరేషన్ గుడివాడ ప్రారంభించింది. కొడాలి నానికి చెక్ పెట్టటానికి చంద్రబాబు రంగంలోకి ఎన్నారైని దింపారు.

tdp special focus on gudivada assembly constituency..NRI as TDP candidate
AP politics : గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి చెక్ పెట్టటానికి చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దుకుని వైసీపీలో చేరి మంత్రి అయిన కొడాలి టీడీపీ పైనే కాదు చంద్రబాబుపై వ్యక్తిగతంగా పరుష పదజాలంతో చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. దీంతో కొడాలి నానికి చెక్ పెట్టటానికి కొడాలిపై పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐని రంగంలోకి దించే యోచనలో ఉంది.
ఇందులో భాగంగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును బరిలో దించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.రాము అభ్యర్థిత్వానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రాము కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో వచ్చే నెల నుంచి గుడివాడలోనే వెనిగళ్ల రాము ఉంటాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కొడాలిని ఓడించాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు కానీ వీలుపడలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా కొడాలిని ఓడించటానికి టీడీపీ అమెరికాలో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న వెనిగళ్ల రాముని రంగంలోకి దింపే యోచనలో ఉంది. టీడీపీ నేత కేశినేని చిన్ని వ్యాపారాల్లో వెనిగళ్ల రాము భాగస్వామిగా ఉన్నారు. వెనిగళ్ల రాము భార్య ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు.
2004,09 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నాని..2012లో టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. తరువాత రెండ విడత జగన్ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కలేదు.
గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపిన చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. దీంతో గుడివాడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు..గుడివాడలో రాముని నిలబెట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటికే రాము ఫ్యామిలీ గ్రౌండ్‌వర్క్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.