AP Corona : ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో కొత్తగా 13,212 కేసులు, ఐదుగురు మృతి

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 14,532 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

AP Corona : ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో కొత్తగా 13,212 కేసులు, ఐదుగురు మృతి

Ap Corona (1)

Updated On : January 21, 2022 / 6:27 PM IST

AP corona positive cases : ఏపీలో కరోనా కలకలం రేపుంతోంది. రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇవాళ కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 64,136 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 14,532 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. విశాఖ జిల్లాలో 2,244, చిత్తూరు జిల్లాలో కొత్తగా 1,585 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Fake RTPCR Certificate : హైదరాబాద్ లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం

నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 12వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. గురువారం కొత్తగా 12,615 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందారు. కరోనా బారిన పడి నిన్న కూడా విశాఖ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.