TDP : సైకోలే కన్నీళ్లు చూసి ఆనందపడతారు – వంగలపూడి అనిత

జబర్దస్త్ హీరోయిన్ ఈరోజే సంక్రాంతి,దీపావళి,దసరా పండగలు చేసుకుంటుందేమో.. గుర్తుంచుకో..!

TDP : సైకోలే కన్నీళ్లు చూసి ఆనందపడతారు – వంగలపూడి అనిత

Anitha

Updated On : November 19, 2021 / 7:33 PM IST

TDP : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని బూతు పురాణంగా మార్చేశారని తీవ్రంగా ఆరోపించారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. కేటుగాళ్లు అందరూ అసెంబ్లీలో కూర్చొని వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభ్యత మరిచారని అన్నారు. సీఎం తల్లి కూడా ఒక మహిళ, ఆయన చెల్లి కూడా ఒక మహిళేనని… వైసీపీ నాయకులు మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని అన్నారు.

Read This : Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి భార్యపై అధికార పార్టీ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడారని.. వారిపై పోలీసులు చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు వంగలపూడి అనిత. “సైకోనా కొడుకులే అవతల వాళ్ల కన్నీళ్లు చూసినప్పుడు ఆనంద పడతారు. వైసీపీ వాళ్లు చేసిన దాడులపై మాట్లాడితే మాపై కేసులు పెడతారు” అని ఆగ్రహం వ్యక్తంచేశారు అనిత.

ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి మాట్లాడిన అనిత… జబర్దస్త్ హీరోయిన్ ఈరోజే సంక్రాంతి,దీపావళి,దసరా పండగలు చేసుకుంటున్నారని అన్నారు. రోజా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పునాదుల మీదే రోజా నిలబడిందని గుర్తుచేశారు. టీడీపీ అధ్యక్షుడు, పార్టీ నేతల భార్యలపై, కుటుంబసభ్యులపై ఇలాగే మాట్లాడితే చెప్పులతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు వంగలపూడి అనిత.

Read This : MLA Roja : కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను తరిమికొడతారు : రోజా