Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు

బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ గా కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ నియామకమయ్యారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మఠంలో రికార్డులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్న ఈశ్వర ఆచారి నుంచి రికార్డులు స్వాదీనం చేసుకుని శంకర్ బాలాజీ చెక్ పవర్ పొందనున్నారు.

Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు

Brahmamgari Matam Issue

Updated On : June 14, 2021 / 11:55 AM IST

Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ గా కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ నియామకమయ్యారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మఠంలో రికార్డులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్న ఈశ్వర ఆచారి నుంచి రికార్డులు స్వాదీనం చేసుకుని శంకర్ బాలాజీ చెక్ పవర్ పొందనున్నారు.

మరోవైపు..బ్రహ్మంగారి మఠంలో రెండు నెలలుగా జీతాల కోసం సిబ్బంది ఎదురు చూస్తున్నారు. పీఠాధిపతి మరణంతో మఠం ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. మఠంలో 46 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మఠం నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ప్రతినెలా 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ మఠం ఫిట్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నాక బ్రహ్మంగారి మఠంలో ఆర్థిక లావాదేవీలు కొనసాగనున్నాయి.

ఈ విషయం పైన దృష్టిసారించిన ప్రభుత్వం.. మఠం పర్యవేక్షణ కోసం ఫిట్ పర్సన్‌గా కడప అసిస్టెంట్ కమిషనర్‌ను నియమించింది. గొప్ప చరిత్ర ఉన్న మఠంపై వివాదాలు చేయొద్దని కోరారు మంత్రి వెల్లంపల్లి. కాస్త ఆలస్యమైనా.. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని అర్థవంతంగా పరిష్కరిస్తామన్నారు. మఠాధిపతిని ప్రకటించడానికి ఎవరికీ అధికారం లేదని.. ఎవరికి వారు మఠాధిపతిని ప్రకటిస్తామనడం సరికాదన్నారు వెల్లంపల్లి.

కడప మఠం మంటలు తగ్గించేందుకు వెళ్లిన పీఠాధిపతులు.. సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరింత అగ్గిరాజుకుంది. వారసత్వం ఎంపిక కాస్తా.. అవినీతి ఆరోపణలు, అక్రమాల విమర్శలతో సంచలనంగా మారింది. శైవక్షేత్రం పీఠాధిపతి కన్వీనర్‌గా వెళ్లిన పీఠాధిపతులంతా దివంగత మఠాధిపతి వెంకటేశ్వరస్వామి మొదటి భార్య పెద్ద కుమారుడి వైపే మొగ్గు చూపారు. కొంతకాలంగా మఠంలో చర్చలు జరిపిన పీఠాధిపతుల బృందం చివరగా.. వెంకటాద్రిస్వామినే మఠాధిపతిని చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

Read More : Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..