APPSC : గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌ పరీక్ష.. అభ్యర్థులు ఇవి అస్సలు మర్చిపోవద్దు

గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడీ తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

APPSC : గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌ పరీక్ష.. అభ్యర్థులు ఇవి అస్సలు మర్చిపోవద్దు

APPSC Group2 exam 2024

APPSC Group2 exam 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 897 గ్రూప్- ఉద్యోగాలకు ఇవాళ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది. మొత్తం 1,327 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వహణకు అధికారులు సిద్ధం చేయగా.. 4,83,525 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాల వారీగా 24 మంది ఐఏఎస్ లకు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్ ఆబ్జెక్టీవ్ తరహాలో ఆప్ లైన్ లో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలకు రెండున్నర గంటల్లో ఓఎంఆర్ షీట్ పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.

Also Read : Kieron Pollard : బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ పట్టిన వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. వీడియో వైరల్

ఇదిలాఉంటే గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడీ తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావొద్దని అధికారులు స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సమయం కంటే ముందే వెళ్లాలి. ఏ మాత్రం నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్లలేక పోయినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

Also Read : WPL 2024 : శోభనా ఆశా అదరగొట్టేసింది.. ఉత్కంఠగా రెండో మ్యాచ్‌.. యూపీపై బెంగళూరు విజయం

  • అభ్యర్థులకు సూచనలు ..
    మొబైల్, ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్ లు, ట్యాబ్, ఐప్యాడ్ లు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు.
    హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
    పరీక్ష ప్రారంభానికి కనీసం 60 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి, 30 నిమిషాల ముందే పరీక్ష హాల్ లోకి చేరుకోవాలి.
    నిర్ణీత సమయం ముగిసిన తరువాత సెంటర్ లోకి అనుమతించరని అభ్యర్థులు గుర్తించాలి.
    హాల్ టికెట్ నెంబర్, పేరు తదితర వివరాలు సరైనవో కాదో చూసుకోవాలి.
    పరీక్ష పూర్తి సమయం ముగిసే వరకు అభ్యర్థులు పరీక్షా హాల్ నుంచి బయటకు అనుమతి లేదు.