ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు.. విజేతల ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంపు..

పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల యువతకు ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు.. విజేతల ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంపు..

Aps New Sports Policy (Photo Credit : Google)

Updated On : November 5, 2024 / 12:10 AM IST

Aps New Sports Policy : నూతన క్రీడా పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అందరికీ క్రీడలు అనే విధానంతో తీసుకొచ్చిన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీని సిద్ధం చేశారు. అన్ని రాష్ట్రాలకంటే భిన్నంగా ఏపీలో స్పోర్ట్స్ పాలసీ ఉంటుందని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు.

పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల యువతకు ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటాను 2 శాతం 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు అందించే ప్రోత్సాహక నగదును రూ.75 లక్షల నుంచి రూ.7కోట్లకు పెంచారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఆయన చేసిన రివ్యూలో క్రీడాకారులకు భారీ నజరానా ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలను అనౌన్స్ చేశారు. 4 మిషన్ల ఆజ్జెక్ట్ ఈ పాలసీని డిజైన్ చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, మెజర్స్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టమ్, గ్లోబల్ విజిబులిటీ.. అనే 4 అంశాల ప్రాతిపదికన ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఈ పాలసీ ద్వారా ఇప్పటివరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడాకారుల కోటాను 2శాతం నుంచి 3శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే యూనిఫామ్ సర్వీస్ లో 3శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించారు.

ఇక ఒలింపిక్స్ లో, ఏషియన్ గేమ్స్ లో, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నజరానాను భారీ మొత్తానికి పెంచుతూ చంద్రబాబు నిర్ణయించారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ఇప్పటివరకు రూ.75 లక్షలు నజరానా ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని ఇక నుంచి రూ.7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. రతజ పతకం సాధించిన వారికి ఇప్పటివరకు రూ.50లక్షలు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచారు. ఇక కాంస్యం సాధించిన వారికి ఇప్పటివరకు రూ.30 లక్షలు ఇస్తుండగా.. ఇకపై రూ.3 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

అలాగే ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50లక్షలు చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ.4 కోట్లు, రజతం సాధించిన వారికి రూ.2కోట్లు, కాంస్య పతకం గెలిచిన వారికి కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10లక్షలు చొప్పున ఇవ్వనున్నారు.

వరల్డ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.35 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.20లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ.10 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.5లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.

Also Read : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యల వెనక కారణమేంటి? పూర్తి వివరాలు..