Vijayasai Reddy : హైదరాబాద్‌లో ఆ ఖరీదైన విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? సీబీఐ విచారణకు సిద్ధమేనా? పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి సవాల్

బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే.. ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది. Vijayasai Reddy

Vijayasai Reddy : హైదరాబాద్‌లో ఆ ఖరీదైన విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? సీబీఐ విచారణకు సిద్ధమేనా? పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి సవాల్

Vijayasai Reddy Challenge Purandeswari (Photo : Google)

Updated On : November 3, 2023 / 10:48 PM IST

Vijayasai Reddy Challenge Purandeswari : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అధికార వైసీపీ, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జగన్ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టార్గెట్ చేస్తే.. పురంధేశ్వరిని విజయసాయిరెడ్డి లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం పై పురంధేశ్వరి తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ ఇసుక, మద్యం అక్రమాలకు పాల్పడుతోందని, భారీ కుంభకోణాలు చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నాణ్యత లేని మద్యాన్ని అందిస్తూ పేదల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆమె మండిపడ్డారు. ఇసుక మాఫియా ద్వారా ప్రకృతిని‌ కూడా వైసీపీ‌ ప్రభుత్వం కబలిస్తోందన్నారు.

Also Read : టీడీపీ కీలక నేతకు సీఐడీ నోటీసులు.. హైదరాబాద్ వెళ్లి మరీ

మద్యం విక్రయాల్లో లెక్కల్లోకి రాని డబ్బు వివరాలు తేల్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా మద్యం విక్రయాలు చేస్తున్నారంటే, అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు విజయసాయిరెడ్డి. ఆమెకు కౌంటర్ ఇచ్చారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పని చేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు అని విమర్శించారు.

”మొదట టీడీపీ.. తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్.. మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగు సార్లు పార్టీలు మారిన చరిత్ర పురంధేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే.. ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది.

Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ

ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా?

ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు?” అని పురంధేశ్వరిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.