Ramatheertham Temple : రామతీర్థం వద్ద ఉద్రిక్తత.. అశోక్ గజపతి రాజు, అధికారుల మధ్య తోపులాట!

విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. రామాల‌య పునర్నిర్మాణ శంకుస్థాప‌న జ‌రుగుతున్న స‌మయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం

Ramatheertham Temple : రామతీర్థం వద్ద ఉద్రిక్తత.. అశోక్ గజపతి రాజు, అధికారుల మధ్య తోపులాట!

Ramatheertham Temple

Updated On : December 22, 2021 / 11:42 AM IST

Ramatheertham Temple : విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. రామాల‌య పునర్నిర్మాణ శంకుస్థాప‌న జ‌రుగుతున్న స‌మయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు… ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సాయంతో మంత్రులు శిలాఫలకం ఏర్పాటు చేశారు.

చదవండి : చలో రామతీర్థం : బీజేపీ, జనసేన నేతల పర్యటన, భారీగా పోలీసుల మోహరింపు

ఈ సంద‌ర్భంగా.. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ… ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని… ఏడాదిలో గుడి కట్టి తీరుతం అని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగక పోవడం దారుణమ‌ని ఆగ్రహం అయ్యారు. ఆలయ దర్మకర్తకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుడికి విరాళం ఇస్తే నా మొహంపై విసిరి కొట్టారని… భక్తులు విరాళాలు తిరస్కరించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

చదవండి : Vizianagaram : రామతీర్థం కోదండరామాలయం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం : వెల్లంపల్లి