Chitravathi River : కళ్ల ముందే ఘోరం.. చిత్రావతి నదిలో కొట్టుకుపోయిన ఆటో.. వీడియో
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.

Chitravathi River
Chitravathi River : సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.
ఆటో డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎగువన కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నదికి వరద పోటెత్తింది.