YS Viveka Case: చంచల్ గూడ సెంట్రల్ జైలులో తన తండ్రిని కలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
ములాఖత్ లో భాగంగా తండ్రిని కలిసేందుకు చంచల్ గూడ జైలు అధికారులు అవినాశ్ రెడ్డికి అనుమతి ఇచ్చారు.

Avinash Reddy - YS Bhaskar reddy
YS Viveka Case – Avinash Reddy: హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy)ని ఆంధ్రప్రదేశ్ ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డి కలిశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రెండు నెలల క్రితం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఆయన జైలులో రిమాండ్ లో ఉంటున్నారు. ఇటీవల భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అవినాశ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ లో భాగంగా తండ్రిని కలిసేందుకు చంచల్ గూడ జైలు అధికారులు అవినాశ్ రెడ్డికి అనుమతి ఇచ్చారు.
కాగా, విచారణలో సీబీఐ అధికారులు పలు అంశాలను విస్మరిస్తున్నారని అవినాశ్ రెడ్డి అంటున్నారు. తాము లేవనెత్తుతున్న ముఖ్యమైన అంశాలపై సీబీఐ అధికారుల నుంచి స్పందన లేదని గతంలో అన్నారు.
తాము ధైర్యం కోల్పోమని, తమ నిజాయితీని నిరూపించుకుంటామని అవినాశ్ రెడ్డి పలుసార్లు చెప్పారు. భాస్కర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు పెరగడంతో ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై హైకమాండ్ కీలక నిర్ణయం