వైసీపీలో ఇంకొంత మంది ఇటువంటివారు ఉన్నారు.. వాళ్లని లోపల వేయాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి

'వైసీపీలో నేనేమి ఆస్తులు సంపాదించలేదు. నాకున్నది, నా వియ్యంకుడి ఆస్తులు జగన్ కి ఇచ్చాను' అని చెప్పారు.

వైసీపీలో ఇంకొంత మంది ఇటువంటివారు ఉన్నారు.. వాళ్లని లోపల వేయాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి

Updated On : March 14, 2025 / 8:22 PM IST

వైసీపీలో ఇంకా కొంతమంది స్కామర్స్ ఉన్నారని, వాళ్లని లోపల (జైలు లోపల) వేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జనసేన పార్టీ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో 12వ ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. ఇందులో బాలినేని మాట్లాడారు.

“జనసేనలో ఇది నా మొదటి సభ. నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్. నాకు ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే అమితమైన ప్రేమ. వైఎస్సార్‌ కోసమే వైసీపీలో చేరాను. మంత్రి పదవి వదిలి వైసీపీలో చేరాను. జగన్ నాకు మంత్రి పదవి ఇచ్చినట్టు ఇచ్చి పదవి తీసేశారు.

Also Read: నాగబాబుకి విషెస్ చెబుతూ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్‌

వల్లభనేని వంశీ, పోసానిని అరెస్టు చేస్తే తెగ బాధపడుతున్నారు. మీరు రఘురామ కృష్ణం రాజును అరెస్టు చేసి కొట్టించినప్పుడు తెలియలేదా? పవన్ కల్యాణ్, చంద్రబాబు కనుక 9 నెలలు ఆగారు.. నేనైతే అధికారం వచ్చిన మరుసటి రోజే లాఠీతో కొట్టించే వాణ్ణి.

వైఎస్సార్ దయతో జగన్ సీఎం అయ్యారు. పవన్ స్వశక్తితో డిప్యూటీ సీఎం అయ్యారు. వైఎస్సార్ వల్ల ఒక్కసారి సీఎం అయ్యావ్ జగన్. ఇంకో సారి సీఎం అవ్వు అవ్వు చూద్దాం. పవన్ అనుమతి ఇస్తే మా జిల్లాలో వైసీపీ లేకుండా చేస్తా.. నా బలం ఏంటి చూపిస్తా. వైసీపీలో నేనేమి ఆస్తులు సంపాదించలేదు. నాకున్నది, నా వియ్యంకుడి ఆస్తులు జగన్ కి ఇచ్చాను. నా ఆస్తులు కాజేశారు. నాతో పాటు గత వైసీపీ ఎమ్మెల్యేలు అందరిపై ఎంక్వయిరీ వెయ్యండి” అని బాలినేని అన్నారు.

Also Read: మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. జగన్ ఇలా హాస్యం పండిస్తున్నారు: నాగబాబు వార్నింగ్